Virat Kohli: ఇదేందయ్యా ఇది.. ఇలా చేస్తున్నారు.. కోహ్లీ రియాక్షన్ వైరల్.. వీడియో ఇదిగో!

Kohlis Stunned Reaction On Bumrah Missed Catch Goes Viral
  • న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కలవరపెట్టిన భారత్ ఫీల్డింగ్ లోపాలు
  • సెంచరీ హీరో మిచెల్ క్యాచ్‌ను రెండుసార్లు జారవిడిచిన ఫీల్డర్లు
  • బుమ్రా చేతిలో పడి జారిన బంతి
  • కోహ్లీ తీవ్ర అసంతృప్తి
టీమిండియా బ్యాటింగ్ గ్రేట్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అది వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా, మైదానంలో అతడి రియాక్షన్ ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించినా ఫీల్డింగ్ లోపాలు కలవరపెట్టాయి. డరిల్ మిచెల్‌కు మన ఫీల్డర్లు రెండుసార్లు ప్రాణం పోసి సెంచరీ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇది భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. 

కుల్దీప్ సంధించిన బంతిని మిచెల్ లాంగాఫ్ దిశగా బలంగా బాదాడు. అక్కడే ఉన్న పేసర్ బుమ్రా పరిగెత్తుకుంటూ వచ్చి దానిని అందుకునే ప్రయత్నం చేశాడు. బంతి చేతిలో పడడంతో అందరూ మిచెల్ దొరికిపోయినట్టేనని భావించారు. కోహ్లీ సంతోషంతో చేతులెత్తాడు. అయితే, బుమ్రా చేతిలో పడిన బంతి అంతే వేగంతో జారి కిందపడింది. అప్పటికే ఓసారి రవీంద్ర జడేజా క్యాచ్ మిస్ చేయడం, రెండోసారి బుమ్రా క్యాచ్‌ను జారవిడవడం చూసి కోహ్లీ తీవ్ర నిరాశ చెందాడు. ‘ఇదేందయ్యా ఇది..’ అన్నట్టుగా చేతిని తిప్పుతూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పుడీ రియాక్షన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Virat Kohli
Jasprit Bumrah
Daryl Mitchell
ICC World Cup 2023

More Telugu News