Jagga Reddy: భవిష్యత్ ముఖ్యమంత్రిని నేనే.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Will Be The Chief Minister Of Telangana Says Jagga Reddy
  • మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి
  • ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నోరు కట్టుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్య
  • సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అన్న కాంగ్రెస్ నేత
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్ ముఖ్యమంత్రిని తానేనని పేర్కొన్నారు. వచ్చే పదేళ్లలో తాను ముఖ్యమంత్రిని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. దసరా సందర్భంగా మనసులో మాటలను చెబుతున్నానని పేర్కొన్నారు. 

సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అని, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీనినెవరూ కాదనలేరని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నోరు కట్టుకోవాల్సి వచ్చిందని, లేదంటే మరెన్నో విషయాలను మీతో పంచుకుని ఉండేవాడినని పేర్కొన్నారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని తెలిపారు. కార్యకర్తలకు కష్టం వచ్చిందని తెలిస్తే అక్కడ వాలిపోతానన్న జగ్గారెడ్డి.. ప్రజల ఆశీర్వాదం ఎప్పటికీ తనపై ఉండాలని కోరుకున్నారు.
Jagga Reddy
Congress
Sangareddy
Telangana CM

More Telugu News