Nara Bhuvaneswari: తిరుపతి చేరుకున్న నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari arrives Tirupati
  • ఈ నెల 25 నుంచి 'నిజం గెలవాలి' కార్యక్రమం
  • రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్న నారా భువనేశ్వరి
  • రేపు తిరుమలలో శ్రీవారి దర్శనం
  • అనంతరం నారావారిపల్లె చేరుకోనున్న భువనేశ్వరి
  • అక్కడ కులదేవతకు పూజలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి తిరుపతి చేరుకున్నారు. ఆమె రేపు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు నిర్వహించనున్నారు. నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి 'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ వార్త విని ఆవేదనతో చనిపోయిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఎల్లుండి చంద్రగిరి శివారు అగరాలలో జరిగే బహిరంగ సభలోనూ భువనేశ్వరి పాల్గొంటారు.

  • Loading...

More Telugu News