Nara Lokesh: 'మనం చేద్దాం జగనాసుర దహనం' కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్, బ్రాహ్మణి

Nara Lokesh and Brahmani participates Manam Cheddam Jaganasura Dahanam program
  • చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా 'మనం చేద్దాం జగనాసుర దహనం'
  • సైకో పోవాలి అని రాసున్న పోస్టర్లను మంటల్లో వేసిన లోకేశ్, బ్రాహ్మణి 
  • రాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న టీడీపీ 

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నేడు 'మనం చేద్దాం జగనాసుర దహనం' కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. రాజమండ్రిలో ఉన్న నారా లోకేశ్, నారా బ్రాహ్మణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'సైకో పోవాలి' అని రాసి ఉన్న పోస్టర్లను మంటల్లో దహనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో విరివిగా దర్శనమిస్తున్నాయి. 

చంద్రబాబు అరెస్టయ్యాక... టీడీపీ ఇప్పటివరకు మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాలు నిర్వహించడం తెలిసిందే. ఈ క్రమంలోనే మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమం తీసుకువచ్చారు. ఈ దసరా పండుగ నాడు జగన్ అనే చెడుపై చంద్రబాబు అనే మంచి సాధించే విజయంగా జగనాసుర దహనం కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ పేర్కొంది. 

అటు, ఎన్టీఆర్ భవన్ వద్ద చేపట్టిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News