బంగ్లాదేశ్‌లో రెండు రైళ్ల ఢీ... 15 మంది మృతి
- రైలు ప్రమాదంలో 100 మంది వరకు గాయాలు
- మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం
- బంగ్లాదేశ్‌లో తరుచూ రైలు ప్రమాదాలు
ప్రయాణికులు ఉన్న రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటన జరిగిన ప్రాంతం ఢాకాకు 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వ అధికారి సాధిక్ రహ్మాన్ తెలిపారు. బంగ్లాదేశ్‌లో సరిగ్గా లేని సిగ్నల్ వ్యవస్థ, నిర్లక్ష్యం, పాత ట్రాక్స్ వల్ల తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతుంటాయి.