Elon Musk: వికీపీడియా నేను చెప్పిన ఈ పేరు పెట్టుకుంటే బిలియన్ డాలర్లు ఇస్తా: ఎలాన్ మస్క్

  • వికీపీడియా పేరును డికీపీడియాగా మార్చుకోవాలన్న మస్క్
  • వికీమీడియా ఫౌండేషన్ కు అంత డబ్బు ఎందుకని ప్రశ్న
  • కచ్చితంగా ఈ డబ్బు వికీపీడియాను నిర్వహించడం కోసం కాదని వ్యాఖ్య
Elon Musk Willino Offer 1 Billion To Wikipedia If It Changes Name

ట్విట్టర్ ను చేజిక్కించుకున్నప్పటి నుంచి స్పేస్ ఎక్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అనునిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వికీపీడియాకు మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. వికీపీడియా తన పేరును మార్చుకుంటే ఆ సంస్థకు 1 బిలియన్ డాలర్లను ఇస్తానని తెలిపారు. వికీపీడియా తన పేరును డికీపీడియాగా మార్చుకోవాలని చెప్పారు.

 వికీపీడియా విరాళాల ద్వారా నడుస్తుందనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. వికీపీడియా హోమ్ పేజ్ లో 'వికీపీడియా ఈజ్ నాట్ ఫర్ సేల్' అని కనిపిస్తుంది. దీనిపై మస్క్ స్పందిస్తూ... వికీమీడియా ఫౌండేషన్ కు అంత డబ్బు ఎందుకని ప్రశ్నించారు. ఈ డబ్బు కచ్చితంగా వికీపీడియాను నిర్వహించడం కోసమైతే కాదని అన్నారు. మీరు ఈ డబ్బంతా ఏం చేస్తారనే చాలా మందికి సందేహాలు ఉన్నాయని చెప్పారు. వికీపీడియాలో కచ్చితత్వం ఉండాలనే తాను ఈ ఆఫర్ చేస్తున్నానని అన్నారు. మస్క్ వ్యాఖ్యలపై వికీపీడియా ఇంకా స్పందించలేదు.

More Telugu News