Sachin Tendulkar: భలే మ్యాచ్..షమీ సూపర్: సచిన్ టెండూల్కర్

Shamis five wicket haul was top notch Virat displaying both aggression and astuteness says Sachin
  • న్యూజిలాండ్ పై తొలిమ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం
  • దిగ్గజాల పోరు బాగుందని సచిన్ టెండూల్కర్ ప్రశంస
  • షమీ ఐదు వికెట్లు తీసి గొప్ప ప్రదర్శన ఇచ్చాడన్న క్రికెట్ లెజెండ్
  • కోహ్లీ దూకుడు చూసి ఆనందం కలిగిందని వ్యాఖ్య

న్యూజిలాండ్ పై భారత్ పోరాడి గెలిచిన తీరుపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ వరల్డ్ కప్‌లో అజేయంగా కనిపిస్తున్న న్యూజిలాండ్ ను టీమిండియా అద్భుతంగా కట్టడి చేసింది. ముఖ్యంగా మహ్మద్ షమీ, విరాట్ కోహ్లీ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌పై తాజాగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ ప్రశంసలు కురిపించారు. 

‘‘దిగ్గజాల పోరు అద్భుతంగా ఉంది. టీమిండియా తాము పరిస్థితులకు ఎదురీదగలనని చూపించింది. తన సత్తా చాటుకుంటూ నెం.1 స్థానాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీ సూపర్‌గా ఆడాడు. బ్యాటర్లు కూడా ఈసారి మెరిశారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ దూకుడు చూసి సంబరం కలిగింది’’ అంటూ సచిన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. 

  • Loading...

More Telugu News