Mohammed Shami: వరల్డ్ కప్ ఘనత... అనిల్ కుంబ్లేను అధిగమించిన మహ్మద్ షమీ

Mohammed Shami surpasses Anil Kumble record most wickets in World Cups for Team India
  • వరల్డ్ కప్ లలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్ల జాబితాలో షమీకి మూడో స్థానం
  • 32 వికెట్లు పడగొట్టిన షమీ
  • కుంబ్లే (31)ను అధిగమించిన వైనం
  • 44 వికెట్లతో అగ్రస్థానంలో జగవళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్
వరల్డ్ కప్ లలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో మహ్మద్ షమీ మూడో స్థానంలో నిలిచాడు. ఇవాళ న్యూజిలాండ్ తో ధర్మశాలలో జరుగుతున్న పోరులో షమీ... ఓపెనర్ విల్ యంగ్ ను అవుట్ చేశాడు. తద్వారా షమీ వరల్డ్ కప్ లలో సాధించిన వికెట్ల సంఖ్య 32కి పెరిగింది. టీమిండియా లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 31 వికెట్ల ఫీట్ ను షమీ అధిగమించాడు. 

ఈ జాబితాలో పేస్ దిగ్గజం జవగళ్ శ్రీనాథ్, లెఫ్టార్మ్ సీమర్ జహీర్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారు. వీరు ఇరువురు వరల్డ్ కప్ లలో  44 వికెట్లు తీయడం విశేషం. ఇప్పుడు వీరిద్దరి తర్వాత స్థానంలో షమీ నిలిచాడు. మరో పేసర్ జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ కప్ లలో 28 వికెట్లు తీసి కుంబ్లే తర్వాత స్థానంలో ఉన్నాడు.
Mohammed Shami
Most Wickets
Anil Kumble
World Cup
Team India

More Telugu News