బట్టలు ఉతికాక వాషింగ్ మెషిన్ మూత కాసేపు తెరిచే ఉంచాలట.. ఎందుకంటే?
- మెషిన్ లో గాలి బయటకు పోకుంటే దుర్వాసన..
- దుస్తులు కూడా వాసన వస్తాయంటున్న నిపుణులు
- ఉపయోగించాక శుభ్రం చేయాలని సూచన
దీనివల్ల మెషిన్ లో గాలి బయటకు పోయే అవకాశం ఉండదని, దీంతో దుర్వాసన వస్తుందని నిపుణులు అంటున్నారు. మరోసారి మెషిన్ ను ఉపయోగించినపుడు ఈ దుర్వాసన బట్టలకు అంటుకుంటుందని హెచ్చరించారు. వాషింగ్ మెషిన్ తో పని పూర్తయ్యాక కనీసం 40 నుంచి 45 నిమిషాల పాటు మెషిన్ డోర్ తెరిచిపెట్టడం వల్ల దుర్వాసన రాకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు తెలిపారు.