Kane Williamson: గ్రేట్ ఖాలీని కలుసుకున్న న్యూజిలాండ్ కెప్టెన్.. నవ్వించే పోస్ట్

Kane Williamson shares hilarious post on Instagram after meeting The Great Khali
  • ఖాలీతో షేక్ హ్యాండ్ ఇస్తూ దిగిన ఫొటో షేర్
  • ఆ సమయంలోనే తన వేలికి ఫ్రాక్చర్ అంటూ జోక్
  • నిజానికి బంగ్లాదేశ్ తో మ్యాచ్ సమయంలో విలియమ్సన్ వేలికి గాయం
  • అతడి హాస్య చతురతను మెచ్చుకుంటున్న నెటిజన్లు
గ్రేట్ ఖాలీ.. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ రెజ్లింగ్ లో భారత్ కు పేరు తెచ్చిపెట్టిన వ్యక్తి. బీజేపీ నేత. ఖాలీని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కలుసుకున్నాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను పంచుకుంటూ మంచి హాస్యం పండించే ప్రయత్నం చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ మంచి పోరాట పటిమను ప్రదర్శిస్తుండడం తెలిసిందే. కేన్ వేలికి గాయం కావడం ద్వారా న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా కేన్ వేలు ఫ్రాక్చర్ అయింది. 

తన వేలి గాయానికి, ఖలీతో భేటీకి విలియమ్సన్  ముడిపెడుతూ ఓపోస్ట్ పెట్టాడు. గ్రేట్ ఖలీతో షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటోని షేర్ చేశాడు. ‘‘నిజంగా నా వేలు ఎప్పుడు ఫ్రాక్చర్ అయిందంటే.. నిజంగా బలమైన షేక్ హ్యాండ్ ఇచ్చిన సమయంలోనే’’ అంటూ నవ్వుల ఎమోజీ వేశాడు. గ్రేట్ ఖాలీని కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని విలియమ్సన్ తన హాస్య చతురతను చాటాడు. కష్ట సమయంలోనూ తన హాస్యాన్ని చాటుకున్నాడంటూ ఓ యూజర్ కామెంట్ చేయడం గమనార్హం. ‘‘అందుకే మేము నిన్ను లవ్ చేస్తాం. భారత్ నిన్ను ప్రేమిస్తుంది’’అని పేర్కొన్నాడు. 

గ్రేట్ ఖాలీ అసలు పేరు దిలీప్ సింగ్ రాణా.
Kane Williamson
Great Khali
shake hand
fginger fracture
newzealand

More Telugu News