Team India: పాండ్యా స్థానంలో ఆడించబోయే ఆటగాడిపై హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్ ! తుది జట్టుపై క్లారిటీ ఉందని వ్యాఖ్య

  • రెండు, మూడు ఆప్షన్లు ఉన్నాయన్న ద్రావిడ్
  • ఆల్‌రౌండర్‌గా ఉండడమే శార్ధూల్ ఠాకూర్‌ పాత్ర అని వ్యాఖ్య
  • న్యూజిలాండ్‌పై పాండ్యా స్థానంలో ఠాకూర్‌ను ఆడించొచ్చని అంచనాలు
Coach Rahul Dravid hint on final 11 against newzealand

చీలమండ గాయంతో న్యూజిలాండ్‌పై మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా దూరమవ్వడంతో అతడి స్థానంలో ఆడించబోయే ఆటగాడి విషయంలో ఉత్కంఠ నెలకొంది. తుది జట్టులో ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంటారా? లేక పేసర్ మహ్మద్ షమీని జట్టులోకి తీసుకుంటారా అనే చర్చ నడుస్తోంది. అయితే మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభమవనుందనగా టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 


హార్ధిక్ పాండ్యా సహజంగానే జట్టుకు కీలకమైన ఆటగాడని, అతడి స్థానాన్ని భర్తీ చేసే విషయంలో జట్టు సమతుల్యత పాటిస్తామన్నాడు. ఉత్తమ ఎంపిక ఉంటుందని అన్నాడు. మొదటి నాలుగు మ్యాచ్‌ల మాదిరిగా జట్టు అంత సమతూకంగా ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డాడు. శార్ధూల్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకోనివచ్చే అభిప్రాయాలు కలిగేలా ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో బౌలింగ్ ఆల్‌రౌండర్ కలిగివుండడమే శార్ధూల్ ఠాకూర్ పాత్ర అని, అతడు నాణ్యమైన ఆటగాడని వ్యాఖ్యానించాడు. ఇక షమీతోపాటు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు కూడా నాణ్యమైన ఆటగాళ్లని విశ్లేషించాడు. దీంతో తుది జట్టుపై క్లారిటీ ఇవ్వకపోయినా శార్థూల్ ఠాకూర్ వైపు మొగ్గుచూపొచ్చని సంకేతాలు ఇచ్చినట్టయ్యింది.

  • Loading...

More Telugu News