Poonam Kaur: చంద్రబాబు విడుదల కోసం ప్రార్థించా:పూనం కౌర్

Actor poonam kaur visits Durgamma temple in Vijayawada
  • విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న నటి పూనం కౌర్
  • కుటుంబసభ్యులతో కలిసి దేవాలయ సందర్శన
  • చంద్రబాబు జైలు పాలవడం అందరినీ కలచి వేస్తోందని వెల్లడి
నటి పూనం కౌర్ శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె తాను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుకున్నట్టు వెల్లడించారు. పెద్ద వయసులో ఉన్న చంద్రబాబు జైల్లో ఉండటం ప్రపంచవ్యాప్తంగా కలచి వేస్తోందని అన్నారు.
Poonam Kaur
Chandrababu
Tollywood

More Telugu News