రన్ టైమ్ కుదింపు... టైగర్ నాగేశ్వరరావు నిడివిపై కీలక నిర్ణయం
- సినిమా బాగున్నప్పటికీ రన్ టైమ్ ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు
- సినిమా నిడివి దాదాపు అరగంటపాటు తగ్గిస్తున్నట్లు తెలిపిన చిత్రయూనిట్
- సినిమా నిడివి గం.3.02 నిమిషాల నుంచి గం.2.37 నిమిషాలకు తగ్గింపు
రవితేజ ప్రధానపాత్రలో నటించారు. అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణుదేశాయ్, జిషుసేన్ గుప్త తదితరులు నటించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు పాటిజివ్ టాక్ వచ్చింది. కథ, కథనం అంతా బాగున్నప్పటికీ సినిమా నిడివి ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో రన్ టైమ్ ను తగ్గిస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.