Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక

AP government releases DA for employees
  • డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • ఉద్యోగుల డీఏను 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
  • డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి అమలు
ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా శుభవార్తను అందించింది. డీఏను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డీఏను 2022 జులై 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు.

నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఉద్యోగుల సంఘం నేతలు కలిసి డీఏ విడుదల చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించారు. అగస్ట్ 2న విజయవాడలో జరిగిన ఏపీఎన్జీవో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ డీఏ ఇస్తామని ప్రకటించారు. దసరాకు రెండు రోజుల ముందు ఇప్పుడు డీఏ విడుదల చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh
Government
YS Jagan
employees

More Telugu News