Congress: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులుగా కర్ణాటక మంత్రి బోసురాజు, అశోక్ శంకర్రావు

Congress party appoints elections observers for Telangana
  • తెలంగాణలో రాజుకున్న ఎన్నికల వేడి
  • అభ్యర్థుల జాబితా రూపకల్పనలో కాంగ్రెస్ కసరత్తులు
  • ఈ రాత్రికి లేదా రేపు అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం 

తెలంగాణ ఎన్నికల తేదీ వచ్చిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు చేస్తోంది. ఇవాళ ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇదే అంశంపై సమావేశం నిర్వహించారు. దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఈ రాత్రికి లేదా రేపు విడుదల చేయనున్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ నేటి సమావేశంలో తెలంగాణ ఎన్నికలకు పరిశీలకులను నియమించింది. తెలంగాణ ఎన్నికల పరిశీలకులుగా కర్ణాటక మంత్రి బోసురాజు, అశోక్ శంకర్రావులను నియమించింది.

  • Loading...

More Telugu News