Nara Brahmani: నారా బ్రాహ్మణి మైండ్‌ గేమ్‌ ఆడుతోంది: బండి పుణ్యశీల

Nara Brahmani playing mind game says Bandi Punyaseela
  • బ్రాహ్మణి చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తోందన్న పుణ్యశీల
  • మామను మించిన కోడలిగా వ్యవహరిస్తోందని విమర్శ
  • జగన్ ఫ్యామిలీపై అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై పోరాడుతామని వ్యాఖ్య

టీడీపీ యువనేత నారా లేకేశ్ భార్య బ్రాహ్మణిపై ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బండి పుణ్యశీల విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ను ఎదుర్కోలేక బ్రాహ్మణి మైండ్ గేమ్ ఆడుతోందని ఆమె అన్నారు. చంద్రబాబు జైల్లో, లోకేశ్ ఢిల్లీలో ఉండగా బ్రాహ్మణి చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. తన తండ్రి బాలకృష్ణను కూడా పక్కన పెట్టి.... మామను మించిన కోడలిగా వ్యవహరిస్తోందని అన్నారు. తన మామ జైలుకు వెళ్లిన తర్వాత ఎక్కడ తన తండ్రి పార్టీని నడిపిస్తారో అన్న డౌటొచ్చి తనే ముందుకు వచ్చిందని చెప్పారు. జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై పోరాడుతామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. 

  • Loading...

More Telugu News