BRS: 59 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్

59 BRS MLAs have criminal cases
  • తెలంగాణలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 119
  • 72 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్న ఏడీఆర్
  • ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు ఉన్నాయని వెల్లడి

తెలంగాణలోని మొత్తం 119 మంది ఎమ్మెల్యేలలో 72 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంచలన విషయాన్ని వెల్లడించింది. వీరిలో ఏడుగురు ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు, నలుగురిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని తెలిపింది. 46 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పింది. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలలో 59 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొటున్నారని తెలిపింది. ఎంఐఎంకు చెందిన ఆరుగురు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయని చెప్పింది. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారని తెలిపింది.

  • Loading...

More Telugu News