Paritala Sunitha: చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదు... న్యాయం గెలుస్తుంది: పరిటాల సునీత

Paritala Sunitha says chandrababu never done wrongs
  • బెజవాడ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి
  • చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించానన్న సునీత
  • వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి ముఖ్యమంత్రి అవుతారన్న టీడీపీ నేత

చంద్రబాబు పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని తాను బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని ప్రార్థించానని మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత అన్నారు. శనివారం ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రికి వచ్చి లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆమె బయట మీడియాతో మాట్లాడుతూ... న్యాయం గెలుస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. తమ పార్టీ అధినేత ఎలాంటి తప్పు చేయలేదన్నారు.

వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కూడా అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. కాగా, లలితా త్రిపుర సందరీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.

  • Loading...

More Telugu News