DVV Entertainment: ట్రిపులార్ ప్రొడక్షన్ హౌస్‌తో నాని క్రేజీ కాంబో.. 24న ముహూర్తం

DVV Entertainment announced movie with Nani
  • నానితో సినిమా ప్రకటించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌
  • మరోమారు వివేక్ ఆత్రేయతో జట్టుకట్టిన నాని
  • థ్రిల్స్, చిల్స్, ఫన్ కోసం రెడీగా ఉండాలన్న డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్

నాచురల్ స్టార్ నాని మరో క్రేజీ కాంబినేషన్‌తో వచ్చేస్తున్నాడు. ట్రిపులార్ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి తన 31వ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎక్స్ ద్వారా ప్రకటిస్తూ వీడియో షేర్ చేసింది. థ్రిల్స్, చిల్స్, ఫన్ కోసం రెడీగా ఉండాలంటూ అభిమానులను సిద్ధం చేసింది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. దసరాను పురస్కరించుకుని 24న ముహూర్తం ఫిక్స్ చేశారు. 

‘హాయ్ నాన్న’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్న నాని ఇప్పుడు మరో సినిమాను ప్రకటించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ ఆత్రేయతో చేసిన ‘అంటే సుందరానికి’ సినిమా రిజల్టును దృష్టిలో పెట్టుకుని ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలని నాని పట్టుదలగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News