Jagan: బెజవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

CM Jagan offers holy clothing to godess Kanakadurga in Vijayawada
  • ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు
  • నేడు మూలానక్షత్రం... సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు
  • సీఎం జగన్ కు పూర్ణకుంభ స్వాగతం
  • సరస్వతీదేవి అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో,  ఏపీ సీఎం జగన్ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వెంట మంత్రులు కూడా ఉన్నారు. సీఎం జగన్ కు దుర్గ గుడి వర్గాలు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధ స్వాగతం పలికాయి. దుర్గమ్మకు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించిన అనంతరం సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సీఎం జగన్ కు ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందించారు.
Jagan
Kanakadurga Temple
Vijayawada
Dasara
YSRCP
Andhra Pradesh

More Telugu News