Sachin Tendulkar: నేను చెప్పిన దానికి విరుద్ధంగా ఆడే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు: టెండూల్కర్

Happy birthday to the man who likes to do exactly the opposite of what I say says Sachin
  • ఈరోజు హార్డ్ హిట్టర్ సెహ్వాగ్ పుట్టిన రోజు
  • సెహ్వాగ్ విధ్వంసకర బ్యాటింగ్ ను కొనియాడుతూ సచిన్ ట్వీట్
  • బోరింగ్ బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకో అంటూ సరదా వ్యాఖ్యలు

ఈరోజు టీమిండియా మాజీ బ్యాటింగ్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా వీరూకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విషెస్ తెలిపాడు. సెహ్వాగ్ విధ్వంసకర బ్యాటింగ్ ను కొనియాడుతూ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఒక రోజు తామిద్దరం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో... క్రీజ్ లో నిలబడు, నెమ్మదిగా ఆడు అని వీరూకి చెప్పానని... దానికి ఓకే అని చెప్పాడని సచిన్ తెలిపాడు. కానీ, ఆ మరుసటి బంతికే ఫోర్ బాదాడని చెప్పాడు. తాను చెప్పిన దానికి విరుద్ధంగా ఆడేందుకు ఇష్టపడిన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు. 'అందుకే నేను చెపుతున్నా... వీరూ, ఒక బోరింగ్ బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకో' అని సరదాగా వ్యాఖ్యానించాడు. సచిన్ చేసిన సరదా ట్వీట్ పై క్రికెట్ అభిమానులు నవ్వులు చిందిస్తున్నారు.


  • Loading...

More Telugu News