Hardik Pandya: బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. ఆసుపత్రికి తరలింపు!

Hardik Pandya suffers injury scare against Bangladesh
  • బంతిని ఆపబోయే క్రమంలో గాయపడ్డ పాండ్యా
  • పాండ్యాను మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందన్న బీసీసీఐ
  • గాయం తీవ్రతపై స్పష్టతను ఇవ్వని వైనం
వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో పూణె వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. మ్యాచ్ లో ఇండియా 9వ ఓవర్ లో బౌలింగ్ చేస్తుండగా... బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ లిట్టన్ దాస్ స్ట్రయిట్ డ్రైవ్ కొట్టాడు. ఈ సందర్భంగా బంతిని ఆపే ప్రయత్నంలో పాండ్యా గాయపడ్డాడు. ఫిజియో వచ్చి హార్దిక్ ను పరీక్షించాడు. ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి హార్దిక్ ఇబ్బంది పడ్డాడు. దీంతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.

మరోవైపు పాండ్యా గాయంపై బీసీసీఐ ప్రకటన చేసింది. స్కానింగ్ కోసం పాండ్యాను ఆసుపత్రికి తరలించినట్టు తెలిపింది. అతన్ని ఒక మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని వెల్లడించింది. అయితే పాండ్యా గాయం తీవ్రతపై మాత్రం స్పష్టతను ఇవ్వలేదు.
Hardik Pandya
Injury
Team India
BCCI

More Telugu News