Chandrababu: చంద్రబాబుతో ములాఖత్‌లు పెంచాలని న్యాయవాదుల పిటిషన్

Chandrababu lawyers filed petition on mulakath
  • వివిధ పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడేందుకు అవకాశం కావాలన్న న్యాయవాదులు
  • న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు చంద్రబాబును కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని వెల్లడి
  • ములాఖత్‌లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్న న్యాయవాదులు
టీడీపీ అధినేత చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్‌ను జైలు అధికారులు రెండు నుంచి ఒకటికి కుదించిన విషయం తెలిసిందే. ములాఖత్‌లు పెంచాలని కోరుతూ టీడీపీ అధినేత న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్నారు. లీగల్ ములాఖత్‌లు రోజుకు మూడుసార్లు ఇవ్వాలని న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

వివిధ పిటిషన్లపై చంద్రబాబుతో  మాట్లాడటానికి తమకు అవకాశం ఇవ్వాలన్నారు. న్యాయపరమైన అంశాల మీద చర్చించేందుకు చంద్రబాబుతో కలిసేందుకు జైలు అధికారులు అంగీకరించడం లేదని తెలిపారు. ములాఖత్ ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు లాయర్ల లీగల్ ములాఖత్‌పై పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి తెలిపారు.
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News