New Delhi: అకస్మాత్తుగా నిలిచిపోయిన జెయింట్ వీల్.. 50 మందిని కాపాడిన పోలీసులు

50 people stuck as giant wheel stops rotating at Delhis Navratri Mela
  • న్యూఢిల్లీ నరేలా ప్రాంతంలోని మేళాలో బుధవారం ఘటన
  • జెయింట్ వీల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కిందకు దించిన పోలీసులు
  • నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ప్రకటన
న్యూఢిల్లీ‌లోని నరేలా ప్రాంతంలో జరుగుతున్న నవరాత్రి మేళాలో బుధవారం ఓ జెయింట్ వీల్‌ అకస్మాత్తుగా నిలిచిపోవడంతో కలకలం రేగింది. రాత్రి 10.30 గంటల సమయంలో సాంకేతిక లోపం కారణంగా జెయింట్ వీల్ ఆగిపోవడంతో అందులో 50 మంది చిక్కుకుపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు అందరినీ సురక్షితంగా కిందకు దించారు. ఈ మేరకు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. మేళా నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
New Delhi

More Telugu News