Elon Musk: ఎక్స్‌లోకి లాగిన్ అయితే డబ్బులు చెల్లించాలి... వారికి మాత్రం వర్తించదు!

Elon Musk starts charging new users to create account on X
  • ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో ఆదాయ మార్గాలు అన్వేషిస్తోన్న ఎలాన్ మస్క్
  • రెండు దేశాల్లో నాట్ ఏ బాట్ సబ్‌స్క్రిప్షన్ వసూలు
  • ఇప్పటికే ఎక్స్ వినియోగిస్తున్న వారికి నగదు చెల్లింపు వర్తించదని స్పష్టీకరణ

ఎలాన్ మస్క్ ఎక్స్ (ఇది వరకు ట్విట్టర్) ప్లాట్ ఫామ్‌లో ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా, ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసిన ఖాతాదారులు ఏడాదికి కొంత మొత్తం చెల్లించాలని మస్క్ నిర్ధారించారు. ప్రస్తుతం రెండు దేశాల వినియోగదారుల నుంచి 'నాట్ ఏ బాట్' పేరుతో సబ్‌స్క్రిప్షన్ వసూలు చేస్తున్నారు. ఎక్స్ హెల్ప్ సెంటర్ పేజ్‌లో నాట్ ఏ బాట్ పేరుతో ఓ పోస్టును షేర్ చేసింది.

తాము రెండు దేశాల్లోని కొత్త వినియోగదారుల కోసం కొత్త సబ్‌స్క్రిప్షన్ పద్ధతిని నాట్ ఏ బాట్‌ని పరీక్షించడం ద్వారా ప్రారంభించామని, స్పామ్, మానిప్యులేషన్‌ను తగ్గించేలా పరీక్షిస్తున్నామని, అయితే ఇప్పటికే ఎక్స్‌ను వినియోగిస్తున్న వారికి నగదు చెల్లింపు వర్తించదని తెలిపింది. న్యూజిలాండ్, పిలిప్పీన్స్ దేశాల్లోని యూజర్లకు ఇది వర్తిస్తుందని వెల్లడించింది. 

అయితే డబ్బులు చెల్లించలేని యూజర్లు కూడా ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. కానీ వారు పోస్టులను చూడటం, వీడియోలను చూడటం, ఇతర అకౌంట్లను ఫాలో కావడానికి వీలుండదు. కేవలం చదవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. వారు తమ సొంత కంటెంట్‌ను కూడా పోస్ట్ చేయలేరు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఉచితంగా చదవండి, కానీ మీరు రాసింది చదివేందుకు ఏడాదికి ఒక డాలర్ చెల్లించాలని, నిజమైన వినియోగదారులను నిరోధించకుండా బాట్‌లతో పోరాడేందుకు ఇదే మార్గమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News