Nara Bhuvaneswari: ఇక ప్రజాక్షేత్రంలోకి.. నారా భువనేశ్వరి కీలక నిర్ణయం!

Nara Bhuvaneswari to reach people from next week
  • నిజం గెలవాలి పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్న భువనేశ్వరి
  • వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటన
  • వారానికి కనీసం రెండుమూడు చోట్ల భువనేశ్వరి పర్యటనలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అర్ధాంగి కీలక నిర్ణయం తీసుకున్నారు. 'నిజం గెలవాలి' పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తారు. వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటనలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిపోయిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కూడా మళ్లీ ప్రారంభించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొంటారు. ప్రస్తుతం లోకేశ్ యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక తిరిగి పాదయాత్ర చేపడతారు. అప్పటి వరకు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 

  • Loading...

More Telugu News