Rohit Sharma: ఐసీసీ ర్యాంకింగ్స్ లో కోహ్లీని తొలిసారి అధిగమించిన రోహిత్ శర్మ

Rohit Sharma overtakes Virat Kohli in ICC rankings
  • ప్రపంచ కప్ లో అదరగొడుతున్న రోహిత్ శర్మ
  • వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో ఆరో స్థానానికి చేరుకున్న హిట్ మ్యాన్
  • 9వ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ
ప్రపంచ కప్ లో భారీ స్కోర్లతో అదరగొడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటాడు. వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీని తొలిసారి అధిగమించాడు. ఈ జాబితాలో కోహ్లీ ప్రస్తుతం 9వ ర్యాంక్ లో ఉన్నాడు. తొలి స్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఉండగా... రెండో స్థానంలో ఇండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఉన్నాడు. ప్రపంచ కప్ లో వరుసగా రెండు సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ నిలిచాడు.
Rohit Sharma
Virat kohli
ICC Rankings

More Telugu News