Nadendla Manohar: జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళతాయి: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar saya Janasena and TDP will move forward with joint action plan
  • కోనసీమ జిల్లాలో నాదెండ్ల మనోహర్ పర్యటన
  • మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కుల అందజేత
  • వైసీపీ విముక్త ఏపీ కోసం ప్రజలంతా కంకణం కట్టుకున్నారని వెల్లడి
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇవాళ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు జనసైనికుల కుటుంబాలకు పార్టీ తరఫున పవన్ కల్యాణ్ పంపిన రూ.5 లక్షల బీమా చెక్కులను అందించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర ప్రజలంతా కంకణం కట్టుకున్నారని అన్నారు. చంద్రబాబునాయుడు అనుభవం, పవన్ కల్యాణ్ ఆలోచన రాష్ట్రానికి ఎంతో అవసరం అని ఉద్ఘాటించారు. జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళతాయని నాదెండ్ల తెలిపారు.
Nadendla Manohar
Janasena
TDP
Andhra Pradesh

More Telugu News