Mehreen Pirzada: అది సెక్స్ సీన్ కాదు.. మ్యారిటల్ రేప్: మెహ్రీన్ పిర్జాదా

Mehreen Pirzada SLAMS trolls for calling her marital rape sequence a sex scene
  • సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ పై విమర్శలకు కౌంటర్ ఇచ్చిన నటి
  • దారుణమైన రేప్ ను సెక్స్ సీన్లుగా వర్ణించడం బాధేస్తోందని వెల్లడి
  • కథలో భాగంగా నటించానని, తనకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని వివరణ
మ్యారిటల్ రేప్.. భార్యకు ఇష్టం లేకున్నా భర్త ఫోర్స్ చేయడం మ్యారిటల్ రేప్ గా పేర్కొంటారని సినీ నటి మెహ్రీన్ పిర్జాదా వివరణ ఇచ్చింది. ప్రస్తుత సమాజంలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని, బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారని వివరించింది. వాస్తవంలో ఇది చాలా భయంకరమైన అనుభవమని పేర్కొంది. ఇలాంటి సన్నివేశం తను నటించిన వెబ్ సిరీస్ లో ఉందని చెబుతూ.. అలాంటి దారుణమైన సీన్ ను కొన్ని మీడియా వర్గాలు సెక్స్ సీన్లుగా అభివర్ణించడం చూసి చాలా బాధపడ్డానని తెలిపింది. ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ చాలా బోల్డ్ గా నటించిందన్న విమర్శలపై స్పందిస్తూ మెహ్రీన్ ఈ వ్యాఖ్యలు చేసింది.

కొన్ని కథలు అలాంటి సన్నివేశాలను డిమాండ్ చేస్తాయని, కథలో భాగంగానే వాటిని చేయాల్సి వస్తుందని మెహ్రీన్ చెప్పింది. ఓ యాక్టర్ గా కథలో భాగంగా వచ్చే సన్నివేశాలలో నటించడం తన విధి అని తెలిపింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీలో నటించడానికి తనకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని వివరించింది. అయితే, మ్యారిటల్ రేప్ ను సూచించే సన్నివేశాన్ని సెక్స్ సీన్లుగా ఎలా అంటారని మెహ్రీన్ మండిపడింది. మీ ఇంట్లో వాళ్లకు ఇలా జరిగితే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతారా? అంటూ ట్విట్టర్ వేదికగా మెహ్రీన్ ప్రశ్నించింది.

Mehreen Pirzada
marital rape
sex scene
trolls
Mehreen bold acting

More Telugu News