AP Governor: గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు

TDP leaders to meet Governor today
  • సాయంత్రం 5 గంటలకు గవర్నర్ తో భేటీ
  • గవర్నర్ ను కలవనున్న వారిలో అచ్చెన్న, యనమల తదితర నేతలు
  • బాబు అరెస్ట్, టీడీపీ నేతల నిర్బంధాలను గవర్నర్ కు వివరించనున్న నేతలు

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ నేతలు ఈరోజు కలవనున్నారు. గవర్నర్ ను కలిసేందుకు వీరికి సాయంత్రం 5 గంటలకు అపాయింట్ మెంట్ లభించింది. చంద్రబాబు అరెస్ట్, టీడీపీ నేతల నిర్బంధాలు, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను వీరు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 17ఏ నిబంధనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విషయాన్ని గవర్నర్ కు వివరించనున్నారు. గవర్నర్ ను కలవనున్న వారిలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడుతో సహా మరికొందరు సీనియర్ నేతలు ఉన్నారు. గవర్నర్ కు వివరించాల్సిన విషయాలపై చర్చించేందుకు వీరు పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News