Tony Fernades: చొక్కా విప్పి మసాజ్ చేయించుకుంటూ బోర్డు మీటింగ్ లో పాల్గొన్న ఎయిర్ ఏషియా సీఈవో

Air Asia CEO Tony Fernandes shirtless during board meating
  • లింక్డ్ ఇన్ లో తానే స్వయంగా ఫొటో పోస్టు చేసిన సీఈవో
  • టోనీ ఫెర్నాండెజ్ చర్యపై విమర్శలు
  • ఈ వారం చాలా ఒత్తిళ్లతో గడిచిందన్న ఫెర్నాండెజ్
  • అందుకే మసాజ్ చేయించుకున్నానని వివరణ
చవక ధరల విమానయాన సంస్థగా పేరుగాంచిన 'ఎయిర్ ఏషియా'కు సీఈవోగా వ్యవహరిస్తున్న టోనీ ఫెర్నాండెజ్ వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన చొక్కా విప్పి మసాజ్ చేయించుకుంటూ బోర్డు మీటింగ్ లో పాల్గొనడంపై విమర్శలు వస్తున్నాయి. 

దారుణం ఏంటంటే... తాను చొక్కా విప్పి మేనేజ్ మెంట్ సమావేశం నిర్వహించడం తాలూకు ఫొటోను లింక్డ్ ఇన్ లో ఆయనే పంచుకున్నారు. తన చర్య వెనుక కారణాన్ని కూడా ఆయన వివరించారు. 

"ఈ వారం అంతా చాలా ఒత్తిళ్లతో గడిచింది. మసాజ్ చేయించుకుంటే రిలీఫ్ లభిస్తుందని వెరానిటా యోసఫిన్ (ఎయిరేషియా ఇండోనేషియా విభాగం సీఈవో) సూచించారు. నాకు ఇండోనేషియా అన్నా,  ఎయిర్ ఏషియా పని సంస్కృతి అన్నా చాలా ఇష్టం. ఓ సంస్థగా మేం ఎంతో పురోగతి సాధించాం. తాజా సమావేశం ద్వారా క్యాపిటల్ ఏ (ఎయిర్ ఏషియా మాతృసంస్థ)కు వ్యవస్థాగత రూపునిచ్చాం. రానున్న రోజులు ఉద్విగ్నభరితంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మేం సాధించిన దానిపట్ల గర్విస్తున్నాం... అలాగని లక్ష్యంపై మా దృష్టి ఎప్పటికీ మరలిపోదు" అంటూ టోనీ ఫెర్నాండెజ్ లింక్డ్ ఇన్ లో రాసుకొచ్చారు.
Tony Fernades
Shirtless
CEO
Air Asia
Malaysia

More Telugu News