Chandrababu: ఫైబర్ నెట్ కేసును శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Supreme Court adjourns Fibernet case hearing till Friday
  • ఫైబర్ నెట్ కేసులోనూ చంద్రబాబు ఆరోపణలు
  • సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
  • నేడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై కొనసాగుతున్న వాదనలు
  • మధ్యలో ఫైబర్ నెట్  కేసు విచారణ అంశాన్ని గుర్తుచేసిన సిద్ధార్థ లూద్రా 
  • ముందు క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిద్దామన్న ద్విసభ్య ధర్మాసనం
టీడీపీ అధినేత చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదిస్తున్నారు. 

అయితే, ఇవాళ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం వాదనలు వింటోంది. ఫైబర్ నెట్ కేసు విచారణ కూడా జరగాల్సి ఉండడంతో, ఈ వాదనల మధ్యలో సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకున్నారు. సమయం 3 గంటలు అయిందని, ఫైబర్ నెట్ కేసు విచారణ కూడా ఈరోజు ఉందని గుర్తు చేసారు. 

అయితే, ఫైబర్ నెట్ కేసును మరో రోజు చూద్దాం అని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. ముందు క్వాష్ పిటిషన్ విచారణ ముగిద్దాం అని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నాం అని, ఆ మేరకు ఆదేశాలు ఇస్తాం అని వెల్లడించారు. 

అందుకు చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా స్పందిస్తూ.... ఈ కేసులో కోర్టు విచారణ పూర్తయ్యేవరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని గతంలో ఆదేశాలు ఇచ్చారు... ఆ ఆదేశాలను కూడా పొడిగిస్తున్నట్టే కదా అని ధర్మాసనం నుంచి మరింత స్పష్టత కోరారు. అందుకు జస్టిస్ అనిరుద్ధ బోస్ బదులిస్తూ... అవును, అది కూడా పొడిగిస్తున్నట్టే అని స్పష్టం చేశారు. అంతేకాదు, విచారణ ముగిసేంతవరకు అరెస్ట్ చేయవద్దన్న చంద్రబాబు అభ్యర్థనను అంగీకరించాలని ఏపీ ప్రభుత్వానికి సూచన చేశారు.
Chandrababu
AP Fibergrid Case
Supreme Court
Hearing
TDP
Andhra Pradesh

More Telugu News