Nara Bhuvaneswari: నారా భువనేశ్వరిని కలిసేందుకు అనుమతిలేదు.. టీడీపీ వర్గాలకు పోలీసుల నోటీసులు

No Permission To Meet Bhuvaneshwari police issue notices
  • రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి నిరసన కార్యక్రమం
  • ఆమెకు సంఘీభావంగా ఎవరూ జిల్లాకు రావద్దంటూ పోలీసుల నోటీసులు
  • జగన్ కక్ష సాధింపు చర్యలు చూడండంటూ టీడీపీ ఆగ్రహం
రాజమహేంద్రవరం కేంద్రకారాగారం వద్ద చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేటి నుంచి రెండు రోజుల పాటు చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని ఏపీ పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు, భువనేశ్వరిని కలిసి సంఘీభావం ప్రకటించేందుకు టీడీపీ వర్గాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. 

మరోవైపు పోలీసుల తీరుపై టీడీపీ మండిపడింది. జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నారా భువనేశ్వరికి సంఘీభావం తెలపడానికి రావద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
Nara Bhuvaneswari
Telugudesam
YSRCP

More Telugu News