Hyderabad: హైదరాబాద్ రోడ్లపై రెచ్చిపోయిన ప్రేమ జంట... వీడియో వైరల్

Couple Openly Kisses From Moving Car Roof During Night Drive in Hyderabad
  • కారుపైకి చేరి ముద్దులతో ఊగిపోయిన ప్రేమ జంట
  • పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వేపై చోటు చేసుకున్న ఘటన
  • పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్ల డిమాండ్

బైక్ పై రయ్ మంటూ దూసుకుపోతూ ముద్దాడుతున్న ప్రేమికుల చేష్టలు ఇటీవలి కాలంలో కొన్ని వెలుగు చూశాయి. ఉత్తరాదిన ఇటువంటివి బయటపడ్డాయి. వీటిపై పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు. ఇలాంటి సంస్కృతి హైదరాబాద్ నగరానికీ పాకింది. ఓ ప్రేమ జంట కారుపైకి చేరి బహిరంగ ముద్దులతో మజా పొందే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్ లైన్ లోకి చేరడంతో సంచలనంగా మారింది. 


కారుపై ఉండే సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చిన జంట లిప్ కిస్ లతో రెచ్చిపోయారు. వారి వాలకం చూస్తుంటే మద్యం ప్రభావానికి లోనైనట్టుగా కనిపిస్తోంది. ఈ ఘటన పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వేపై చోటు చేసుకుంది. ఈ తతంగాన్ని వెనుక కారులో వస్తున్న వారు ఫోన్ లో చిత్రీకరించడంతో సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

ఈ జంట చేష్టలను ఎక్కువ మంది తప్పుబడుతున్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు కలిగించిన ఈ అసౌకర్యానికి, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, ప్రజల భద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరించినందుకు హైదరాబాద్ పోలీసులు తగిన రీతిలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు ఓ యూజర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News