USA: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారత వ్యక్తి దుర్మరణం

Indian origin man dies in US road crash
  • ఇండియానాపోలిస్ లో రోడ్డు ప్రమాదం 
  • అదుపు తప్పిన కారు.. పక్క లేన్ లో మరో వాహనంతో ఢీ 
  • గాయాలతో మరణించిన సుఖ్వీందర్ సింగ్

అమెరికాలో భారత సంతతికి చెందిన 42 ఏళ్ల వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సుఖ్వీందర్ సింగ్ అనే వ్యక్తి కారుపై నియంత్రణ కోల్పోవడంతో అది అదుపుతప్పి పక్క లేన్ లోకి దూసుకుపోయింది. ఇండియానాపోలిస్ పట్టణంలో ఈ నెల 13న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయాలతో చికిత్స పొందుతూ ఎస్కెనాజి హాస్పిటల్ లో సింగ్ మరణించాడు. 

సింగ్ హోండా అకార్డ్ వాహనంలో వెళుతుండగా, అది అదుపుతప్పి పక్క రోడ్డులోకి చొచ్చుకుపోయింది. అటువైపు నుంచి వస్తున్న వేరొక వాహనంతో ఢీకొట్టింది. అవతలి వాహనం డ్రైవర్, అందులోని మహిళకు సైతం గాయాలయ్యాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News