Urvashi Rautela: నటి ఊర్వశి రౌతేలాకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన భారత్-పాక్ మ్యాచ్

Actor Urvashi Rautela Lost Her iPhone In Narendra Modi Stadium
  • మ్యాచ్‌లో మునిగిపోయి ఖరీదైన ఐఫోన్‌ను పోగొట్టుకున్న బ్యూటీ
  • 24 క్యారెట్ల బంగారం తాపడం చేయించిన ఫోన్ మాయం
  • దొరికితే ఇచ్చేయాలంటూ వేడుకోలు
  • మిశ్రమంగా స్పందిస్తున్న నెటిజన్లు
ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మొన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ అభిమానులకు ఆనందం పంచినా.. నటి ఊర్వశి రౌతేలాకు మాత్రం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. మ్యాచ్ వీక్షణలో మునిగిపోయిన ఊర్వశి అత్యంత ఖరీదైన తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. 

తాను పోగొట్టుకున్న ఐఫోన్ అలాంటి ఇలాంటిది కాదని అది 24 క్యారెట్ల బంగారం తాపడం చేసిన ఫోన్ అని చెప్పుకొచ్చింది. అది ఎవరికైనా దొరికితే ఇవ్వాలని వేడుకున్నారు. ఈ పోస్టుకు పోలీసులు, స్టేడియం అధికారిక ఎక్స్ ఖాతాలను ట్యాగ్ చేశారు. ఆమె పోస్టును చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. 

ఇది పబ్లిసిటీ స్టంట్ అని కొందరంటే.. మరికొందరు మాత్రం ఆ ఫోన్ దొరికిన వ్యక్తి అదృష్టవంతుడని కామెంట్ చేస్తున్నారు. బంగారం లాంటి ఫోన్ దొరికితే ఎవరైనా తిరిగిస్తారా? అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.  తెలుగులో పలు సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసిన ఊర్వశి.. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ పార్టీలో తళుక్కుమంది. ఇటీవల స్కంద సినిమాలోనూ మెరిసింది. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Urvashi Rautela
India-Pak Match
Narendra Modi Stadium

More Telugu News