TCS: టీసీఎస్ లో బ్యాక్ డోర్ లో ఉద్యోగాల అమ్మకం.. 19 మందిపై వేటు

TCS fires 19 employees who involved in recruitment scam
  • ఈ ఏడాది జూన్ లో వెలుగుచూసిన రిక్రూట్ మెంట్ స్కామ్
  • నాలుగు నెలల పాటు దర్యాప్తు చేసిన కంపెనీ యాజమాన్యం
  • 19 మందిని తొలగిస్తున్నట్టు అధికారిక ప్రకటన
బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలను అమ్ముకుంటున్న కుంభకోణం ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ లో వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలకు పాల్పడిన 19 మందిపై టీసీఎస్ వేటు వేసింది. ఈ విషయాన్ని టీసీఎస్ యాజమాన్యం నిన్న అధికారికంగా ప్రకటించింది. తాము జరిపిన విచారణలో రిక్రూట్ మెంట్ స్కామ్ లో 19 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఈ 19 మందిలో 16 మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించగా, మరో ముగ్గురిని రిసోర్స్ మేనేజ్ మెంట్ నుంచి తొలగించారు. ఈ స్కామ్ ఈ ఏడాది జూన్ లో వెలుగులోకి వచ్చింది. వెంటనే కంపెనీ దర్యాప్తు చేపట్టింది. నాలుగు నెలలు దర్యాప్తు చేసిన అనంతరం స్కామ్ కు పాల్పడిన వారిపై కంపెనీ చర్యలు తీసుకుంది. రానున్న కాలంలో కార్పొరేట్ గవర్నెన్స్ ను మరింత బలోపేతం చేస్తామని టీసీఎస్ తెలిపింది. 

TCS
Recruitment Scam

More Telugu News