Iraq: రూ.12 లక్షలకు నవజాత శిశువు అమ్మకానికి యత్నం.. తండ్రి అరెస్ట్!

Father trying to sell newborn online for 15000 dollars and iPhone arrested in Iraq
  • ఇరాక్‌లో వెలుగు చూసిన ఘటన
  • ఆరు రోజుల వయసున్న బిడ్డను అమ్మకానికి పెట్టిన తండ్రి
  • నిందితుడు ఓ ఐఫోన్‌‌ను కూడా అమ్మేందుకు ప్రయత్నించాడన్న నిఘా వర్గాలు

డబ్బు కోసం ఆన్‌లైన్‌లో తన నవజాత శిశువును అమ్మకానికి పెట్టిన ఓ తండ్రిని ఇరాకీ నిఘా వర్గాలు తాజాగా అరెస్ట్ చేశాయి. అతడు ఓ ఐఫోన్ కూడా అమ్మేందుకు యత్నించినట్టు వెల్లడించాయి. బిడ్డ పుట్టి ఆరు రోజులు అయ్యి ఉంటుందని, అతడు 15 వేల డాలర్లకు (మన కరెన్సీలో సుమారు రూ.12 లక్షలు) శిశువును అమ్మకానికి పెట్టాడని చెప్పాయి. నవజాత శిశువును వదులుకునేందుకు అతడు సిద్ధపడటం అక్కడి ప్రజల పరిస్థితికి అద్దం పడుతోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News