India-Pakistan Match: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో మహిళా పోలీస్, ప్రేక్షకుడి మధ్య ఫైట్... వీడియో ఇదిగో!

Brawl between woman cop and audience during India and Pakistan match
  • అహ్మదాబాద్ లో నిన్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్
  • వేదికగా నిలిచిన నరేంద్ర మోదీ స్టేడియం
  • ఓ ప్రేక్షకుడికి, మహిళా పోలీసుకు మధ్య వాగ్వాదం
  • ప్రేక్షకుడి చెంప చెళ్లుమనిపించిన పోలీసు
  • పోలీసుపై చేయి విసిరిన ప్రేక్షకుడు... వీడియో వైరల్

అహ్మదాబాద్ లో నిన్న దాయాదులు భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీమిండియా అభిమానులకు వందశాతం వినోదం అందించిన మ్యాచ్ ఇది. ఈ పోరుకు వేదికగా నిలిచిన నరేంద్ర మోదీ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 1.32 లక్షలు కాగా, స్టేడియం మొత్తం నిండిపోయింది. 

అయితే, ఓవైపు మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుండగా, స్టేడియంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ కు, ప్రేక్షకుడికి మధ్య బాహాబాహీ జరిగింది. 

ఏదో అంశంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరుగుతుండగా మహిళా పోలీసు ఒక్కసారిగా ఆ ప్రేక్షకుడి చెంప చెళ్లుమనిపించింది. దాంతో అతడు కూడా మహిళా పోలీసుపై చేయి విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

  • Loading...

More Telugu News