Rohit Sharma: సిక్స్ కొట్టి కండలు ఎందుకు చూపించాడో హార్దిక్ పాండ్యాకు వివరించిన రోహిత్ శర్మ... వీడియో ఇదిగో!

Rohit Sharma explains Hardik Pandya why he showed his muscles
  • నిన్న వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్
  • దాయాదిపై ఘనంగా నెగ్గిన భారత్
  • రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్
  • 6 సిక్సర్లతో మోత మోగించిన టీమిండియా సారథి
  • రోహిత్ శర్మ కండలు చూపించిన వీడియో వైరల్
వరల్డ్ కప్ లో నిన్న అహ్మదాబాద్ లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనుల విందు చేసింది. ముఖ్యంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రదర్శన "వావ్" అనిపించేలా సాగింది. ఎక్స్ ప్రెస్ పేస్ బౌలర్ గా పేరుగాంచిన హరీస్ రవూఫ్ బౌలింగ్ లో రోహిత్ కొట్టిన సిక్సర్లు విశేషంగా అలరించాయి. 

పాక్ తో పోరులో ఆరు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ... అందులో ఓ భారీ సిక్స్ కొట్టినప్పుడు అంపైర్ కు సరదాగా కండలు చూపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో రోహిత్ శర్మ మ్యాచ్ ముగిశాక హార్దిక్ పాండ్యాకు వివరించాడు. 

సిక్స్ కొట్టాక కండలు చూపించి సెలబ్రేట్ చేసుకోవడం వెనుక కారణం ఏంటి? అని హార్దిక్ పాండ్యా కెప్టెన్ రోహిత్ శర్మను అడిగాడు. 

అందుకు రోహిత్ శర్మ బదులిస్తూ... "అంత పెద్ద సిక్స్ లు ఎలా కొడుతున్నావు... నీ బ్యాట్ లో ఏదో ఉంది అని వాళ్లు అడిగారు. బ్యాట్ లో ఏమీ లేదు... ఉన్నదంతా ఇక్కడే ఉంది అంటూ నా కండలు చూపించాను" అంటూ నవ్వేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Rohit Sharma
Muscles
Umpire
Hardik Pandya
Team India
Pakistan
World Cup

More Telugu News