Virat Kohli: పాక్‌ ఓటమి తరువాత బాబర్ ఆజమ్‌కు కింగ్ కోహ్లీ బహుమతి

Virat Kohli gifts his signed jersey to Babar Azam after India Pakistan clash
  • నిన్నటి మ్యాచ్ అనంతరం స్టేడియంలో పాక్‌ కెప్టెన్‌కు జెర్సీ ఇచ్చిన కింగ్ కోహ్లీ 
  • ఈ చర్యతో కోహ్లీపై నెట్టింట ప్రశంసల వర్షం
  • క్రీడాస్ఫూర్తిని, పరస్పర గౌరవాన్ని చాటారాంటూ క్రికెట్ అభిమానుల హర్షం
నిన్న అహ్మదాబాద్‌‌లో నరేంద్ర మోదీ స్టేడియం‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం ఓటమి భారంతో ఉన్న పాకిస్థాన్‌కు విరాట్ కోహ్లీ ఓ బహుమతి ఇచ్చాడు. తను సంతకం చేసిన జెర్సీని పాక్ కెప్టెన్‌కు బహుమతిగా ఇచ్చి తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. మైదానంలో నువ్వా నేనా అన్నట్టు తలపడే భారత్‌, పాక్‌ జట్టుల మధ్య స్నేహశీలతను అద్భుత రీతిలో ప్రదర్శించిన విరాట్ కోహ్లీపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. 

కోహ్లీ చర్యతో రెండు టీంల మధ్య స్నేహం, పరస్పర గౌరవం వెల్లివిరుస్తాయని క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మైదానంలో ఎలా ఉన్నా బయట మాత్రం తాము పరస్పరం గౌరవించుకుంటామని కోహ్లీ చాటిచెప్పినట్టైందని కామెంట్ చేస్తున్నారు. 

కాగా, నిన్నటి మ్యాచ్‌లో బుమ్రా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పాకిస్థాన్ కుప్పకూలిన విషయం తెలిసిందే. కీలక సమయంలో ఈ బౌలర్ల ద్వయం నాలుగు వికెట్లు తీయడంతో పాక్ ఓటమి ఖరారైంది. చివరకు భారత్ ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్‌లో పాక్‌పై వరుసగా ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది.
Virat Kohli
Babar Azam
India
Pakistan

More Telugu News