Anand Mahindra: భారత్, పాక్ పోరు ముగిశాక నేను చేస్తున్నది ఇదే: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra opines on India win over Pakistan in world cup
  • వరల్డ్ కప్ ఆనవాయతీ కొనసాగించిన భారత్
  • పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన
  • తాను ప్రస్తుతం ఆనంద తాండవం చేస్తున్నానని ఆనంద్ మహీంద్రా వెల్లడి
  • ఆసక్తికర వీడియో పంచుకున్న వైనం
దాయాదులు, చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఇవాళ వరల్డ్ కప్ మ్యాచ్ లో తలపడ్డాయి. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో పాక్ పై తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. పాకిస్థాన్ లో అభిమానుల పరిస్థితి ఏమిటో తెలియదు కానీ, భారత్ లో మాత్రం సంబరాలు మిన్నంటుతున్నాయి. 

భారత క్రీడా రంగానికి వీరాభిమాని అయిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తాను ఆనంద తాండవం చేస్తున్నానని వెల్లడించారు. ఆ మేరకు ఓ ఆఫ్రికన్ డ్యాన్సర్ మెరుపువేగంతో సంప్రదాయ నృత్యం చేస్తున్న వీడియోను ఆయన పంచుకున్నారు. భారత్, పాక్ చారిత్రక సమరం ముగిశాక తాను చేస్తున్నది ఈ సంతోషదాయక నృత్యమేనని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.
Anand Mahindra
World Cup
Team India
Pakistan

More Telugu News