Chandrababu: చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు

Chandrababu lawyers file petition on his health
  • వైద్యుల సూచనలను అధికారులు పాటించేలా చూడాలని పిటిషన్‌లో విజ్ఞప్తి
  • మెడికల్ రిపోర్టులు కోర్టుకు సమర్పించి మెరుగైన వైద్యం అందించాలని కోరిన న్యాయవాదులు
  • పిటిషన్‌పై వాదనలు విననున్న ఏసీబీ న్యాయస్థానం
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన తరఫున న్యాయవాదులు కోర్టుకు వెళ్లారు. ఈ మేరకు వారు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా చూడాలని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు మెడికల్ రిపోర్టులను కోర్టుకు సమర్పించి మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. చంద్రబాబు తరఫు న్యాయవాదుల పిటిషన్‌పై ఏసీబీ న్యాయస్థానం వాదనలు విననుంది.

చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తోన్న టీడీపీ కోర్టుకు వెళ్లాలని, న్యాయవాదుల ద్వారా పిటిషన్ దాఖలు చేయించాలని ఈ రోజు నిర్ణయించింది. దీంతో న్యాయవాదులు ఇందుకు సంబంధించి పిటిషన్‌ను సిద్ధం చేసి, ఆ తర్వాత కోర్టులో దాఖలు చేశారు. 
Chandrababu
Telugudesam
acb

More Telugu News