Vijay: దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు తమిళ సర్కార్ బ్యాడ్‌న్యూస్

Bad news for actor Vijay fans
  • స్పెషల్ షోలు లేవంటూ ప్రభుత్వం ఆదేశాలు
  • థియేటర్ యజమానులతో గొడవ పడితే చర్యలు
  • ప్రభుత్వ ఆదేశాలతో నిరాశలో విజయ్ ఫ్యాన్స్

తమిళనాడులో సినీ అభిమానుల హంగామా కాస్త ఎక్కువనే చెప్పాలి. స్టార్ హీరోలకు లక్షలాది సంఖ్యలో ఉండే ఫాలోవర్లు కొత్త సినిమాల విడుదల సమయంలో తెగ సందడి చేస్తుంటారు. థియేటర్ల వద్ద పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంటారు. తమ అభిమాన హీరో సినిమాని అందరికంటే ముందుగానే చూసేయాలని తెగ ఆరాటపడుతుంటారు. ఇదివరకు అందరికంటే ముందుగా సినిమా చూసి మురిసిపోయేవారు. కానీ ఇప్పుడు స్పెషల్ షోలు వేస్తున్నారు కాబట్టి ఇంకా ముందుగా సినిమా చూసే భాగ్యం సినీ అభిమానులకు దక్కుతోంది. కానీ దళపతి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లియో’ విషయంలో తమిళనాడులోని విజయ్ ఫ్యాన్స్‌కి ఆ అవకాశం లేకుండా పోయింది. ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్ లాంటి ఓ ప్రకటన చేసింది అక్కడి ప్రభుత్వం.


గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న లియోకు ప్రత్యేక షోలు ఏమీ లేవని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేక షోలు వేయాలంటూ అభిమానులు గొడవలకు దిగితే చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తమిళనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ అముత పోలీసులకు ఆదేశాలిచ్చారు. థియేటర్ల వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. హీరో విజయ్ ఫ్యాన్స్ థియేటర్ యజమానులతో గొడవలకు దిగితే చ్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు హీరో విజయ్ ఫ్యాన్స్‌కు ఒకింత నిరాశ కలిగించాయని చెప్పక తప్పదు. ఎందుకంటే అభిమాన హీరో సినిమా ముందుగానే చూసేయాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఆరు రోజులు ముందుగానే అడ్వాన్స్ టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. స్పెషల్ షోల కోసం వారంతా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి తాజా పరిణామం విజయ్ ఫ్యాన్స్‌కి నిరాశ కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

  • Loading...

More Telugu News