Sathyam Rajesh: 'మా ఊరి పొలిమేర 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ .. చీఫ్ గెస్టులు వీరే!

Polimera 2 movi trailer launch event
  • సీక్వెల్ గా రూపొందిన 'మా ఊరిపొలిమేర 2'
  • క్షుద్ర పూజల నేపథ్యంలో నడిచే కథ 
  • రేపు జరగనున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 
  • నవంబర్ 3వ తేదీన సినిమా విడుదల

కరోనా సమయంలో ఓటీటీ ద్వారా విడుదలై అనూహ్యమైన రెస్పాన్స్ ను తెచ్చుకున్న సినిమాలలో 'మా ఊరి పొలిమేర' ఒకటి. సత్యం రాజేశ్ .. కామాక్షి భాస్కర్ల ... బాలాదిత్య ప్రధానమైన పాత్రలను పోషించిన ఆ సినిమాకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. 'సత్యం' రాజేశ్ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. 

గ్రామీణ నేపథ్యంలో .. క్షుద్రపూజల చుట్టూ తిరిగే ఈ కథ .. కథలోని ట్విస్టులు ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించాయి. అందువలన ఆ సినిమాకి సీక్వెల్ గా 'మా ఊరి పొలిమేర 2'ను రూపొందించారు. గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమాను నవంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రేపు ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంటును హైదరాబాద్ - AAA సినిమాస్ .. స్క్రీన్ 4లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా దర్శకుడు హరీశ్ శంకర్ .. నిర్మాత బన్నీవాసు .. హీరో కార్తికేయ హాజరుకానున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితమే రిలీజ్ చేశారు.

  • Loading...

More Telugu News