monocycle: ఈ వెరైటీ మోనో సైకిల్ ను ఎప్పుడైనా చూశారా?

Gujarat mans monocycle reminds netizens of Gyrocycle from Men in Black
  • ఒకే చక్రంతో నడుస్తున్న మోటారు సైకిల్
  • సూరత్ లో కనిపించిన దృశ్యం
  • ఆసక్తిగా చూస్తున్న తోటి వాహనదారులు
వాహనానికి చక్రం ఎక్కడ ఉంటుంది? కూర్చునే సీట్ కిందనే కదా..? దాదాపు ఏ వాహనానికి అయినా ఇదే మాదిరిగా సీటింగ్ కనిపిస్తుంది. కానీ, ఈ వీడియోని గమనిస్తే.. ఇలా కూడా వాహనం ఉంటుందా..? అన్న ఆశ్చర్యం కలగక మానదు. గుజరాత్ లోని సూరత్ పట్టణంలో ఓ వ్యక్తి వినూత్నమైన వాహనంలో ప్రయాణిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి చూసే వారిని ఆకర్షిస్తోంది.   

మార్కెట్లో ఎన్నో రకాల వాహనాలు ఉన్నాయి. వాహన సైజ్ ను బట్టి చక్రాలు ఆధారపడి ఉంటాయి. కానీ, ఈ సూరత్ వాసి రూపొందించిన వాహనానికి ఉండేది ఒక్కటే చక్రం. అది కూడా కింద కాదు. కింది నుంచి పై వరకూ వాహనం మొత్తాన్ని గుండ్రంగా చుట్టేసే విధంగా ఉంటుంది. వాహనాన్ని నడిపే వ్యక్తికి సీట్ ను చక్రం మధ్యలో ఏర్పాటు చేశారు. గుండ్రంగా చక్రం తిరుగుతుంటే, వాహనం నడిపే వ్యక్తి ఆ చక్రం మధ్యలో కూర్చుని స్టీరింగ్ ను నియంత్రించడాన్ని చూడొచ్చు. సూరత్ లో ఈ వాహనాన్ని దర్జాగా నడుపుకుంటూ వెళుతుంటే, ప్రతి ఒక్కరూ దీన్నే వింతగా చూస్తున్నారు. వర్షంలో ఈ బైక్ పనికిరాదని ఓ యూజర్ పేర్కొనగా, మరో యూజర్ తనకు ఇలాంటిది ఒకటి కావాలని పేర్కొనడం గమనించొచ్చు. (వీడియో కోసం)
monocycle
Gyrocycle
surat
unique vehicle

More Telugu News