Chandrababu: చంద్రబాబు ఐదు కిలోల బరువు తగ్గారు: భువనేశ్వరి

Chandrababu lost 5 kg weight says Bhuvaneswari
  • చంద్రబాబు ఆరోగ్యంపై భువనేశ్వరి ఆందోళన
  • ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందని ఆవేదన
  • తన భర్త జీవితానికి తక్షణ ముప్పు సృష్టించేలా ఉన్నాయని ఆందోళన

తన భర్త చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన బరువు తగ్గితే అది కిడ్నీలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, ఈ భయంకరమైన పరిస్థితులు తన భర్త జీవితానికి తక్షణ ముప్పు సృష్టించేలా ఉన్నాయని భువనేశ్వరి ఎక్స్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News