Chandrababu Arrest: చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత: యనమల హెచ్చరిక

TDP Leader Yanamala Demands Super Specialty Medical Treatment
  • రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు
  • ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన యనమల
  • సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని డిమాండ్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  

చంద్రబాబుకు తక్షణం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం అందించాలని కోరారు. ఆయనకు పూర్తిస్థాయిలో వైద్యం చేయడంతోపాటు సరైన వైద్యం అందించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.
Chandrababu Arrest
Rajamahendravaram Jail
Yanamala

More Telugu News