Vijayasai Reddy: నెల్లూరు సిటీ, నెల్లూరు లోక్ సభ స్థానాల నుంచి ఎవరు పోటీ చేస్తారో వెల్లడించిన విజయసాయి

Vijayasai Reddy announces Anil Kumar Yadav as Nellore City candidate
  • నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారన్న విజయసాయి
  • నెల్లూరు పార్లమెంట్ స్థానంలో వేమిరెడ్డి పోటీ చేస్తారని వెల్లడి
  • కొంత కాలంగా అనిల్ అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం

ఏపీలో అప్పుడే ఎన్నికల హడావుడి నెలకొంది. అన్ని పార్టీల్లోనూ పలు నియోజకవర్గాల్లో టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారని ప్రకటించారు. నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. దీంతో అనిల్ పై నెలకొన్ని ఉత్కంఠపై క్లారిటీ వచ్చినట్టయింది.

  • Loading...

More Telugu News