Vijayasai Reddy: పురందేశ్వరి, నారా లోకేశ్ లపై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

Vijayasai Reddy comments on Purandeswari and Nara Lokesh
  • చంద్రబాబు గురించి టీడీపీ నేతల కన్నా పురందేశ్వరి ఎక్కువ బాధపడుతున్నారని ఎద్దేవా
  • సొంత పార్టీ కన్నా బావ పార్టీనే ఆమెకు ఎక్కువని సెటైర్
  • అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ఎందరి కాళ్లు పట్టుకున్నావని లోకేశ్ పై విసుర్లు

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, టీడీపీ యువనేత నారా లోకేశ్ లను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. అవినీతి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తే టీడీపీ నేతల కన్నా పురందేశ్వరి ఎక్కువ బాధపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. తనకు పదవినిచ్చిన పార్టీకన్నా బంధుత్వం, బావ పార్టీనే ఎక్కువంటున్నారని విమర్శించారు. ఢిల్లీలో ఆమె విన్యాసాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ యువనేత నారా లోకేశ్ సమావేశమైన సంగతి తెలిసిందే. దీనిపై విజయసాయి స్పందిస్తూ... అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ఎన్నిసార్లు తిరిగావు, ఎందరి కాళ్లు పట్టుకున్నావని ఎద్దేవా చేశారు. అమిత్ షా నిన్ను కలవాలని తపించినట్టు మళ్లీ మీడియాలో బిల్డప్ దేనికని అన్నారు.

  • Loading...

More Telugu News